GK - జాతీయ చిహ్నాలు
GK - జాతీయ చిహ్నాలు
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది.
2. జాతీయగీతం
1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు.
1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది.
1912 లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధర్, అంబికా చరణ్ మజుందార్ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు.[6]
1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి "మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను పోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
జనగణమన-అధినాయక జయ హే
భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ జయ హే।।
జై హింద్!
Telugu Meaning
పంజాబు, సింధు,
గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము
ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము
ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము.
వింధ్య హిమాలయ పర్వతాలు,
యమున గంగలు
పై కంటే ఎగసే సముద్ర తరంగాలు
ఇవన్నీ..
తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి
తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి
తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి
ఓ జనసమూహాల మనసుల అధినాయక.
మీకు జయము!
ఓ భారత భాగ్య విధాత, మీకు జయము!
నిత్య జయము!

Comments
Post a Comment