GK - జాతీయ చిహ్నాలు
GK - జాతీయ చిహ్నాలు 1. జాతీయ పతాకం : 1921 లో భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడ సమావేశంలో తొలిసారిగా పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయపతాక నమూనాను ప్రదర్శించారు . భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం , తెలుపు , పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. భారతదేశంలో తిరంగా (హిందీ: तिरंगा ) లేక ట్రైకలర్ (ఆంగ్ల: Tri-color ) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం. 2. జాతీయగీతం జనగణమన, భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" ...